Blog

 1. Art (in Telugu)

  Date 21 May 2018
  కళ, కల, కల్ల జూబిలీ హిల్స్ ఏరియాలున్న అపోలో యాంఫీ థియేటర్ల, ‘ఇండీ మిక్స్’(indie mix) అనేటోల్లు మూడ్రోజుల కల్చరల్ ప్రోగ్రాం పెట్టిన్రు. అన్నా! మేము శానామంది కళాకారులను పిలుస్తున్నాం, మీరు గూడా రావాలే, ఫోటోగ్రఫీ కళ గురించి నాలుగు మాటలు మాట్లాడాలే అని పిలిషిన్రు. మంచి పని చేస్తున్నారు తమ్మీ, నేనుభీ తప్పక నావంతు పనిజేస్త అని మాటిచ్చిన. ఇయ్యాల్రేపు కళల మీద శ్రద్ధతోని పన్జెశెటోళ్ళు కరువయిపోయిన్రనుకున్న, కానీ,…

 2. Dark Lights (in Telugu)

  Date 11 May 2018
  చీకటి వెలుగు నిద్రమబ్బు కళ్ళతో కిటికీ వైపు చూస్తే బయటింకా చీకటిగానే ఉంది. ఈరోజు ఆదివారం కదా, ఇంకొంచెం సేపు నిద్రపోవచ్చని నాలో నేనే గొనుక్కున్నాను. ఫోన్లో అలారం మోతకు మెలకువయ్యింది నాకు. ‘అదేందీ? బయటేమో ఇంకా పొద్దు పొడవనేలేదు, సెలవురోజు సుబ్బరంగా తొమ్మిదిన్నరకు మొగాల్సిన అలారం ఇప్పుడే మోగుతుందేందీ’ అని ఆశ్చర్యం వేసింది. కొత్త ఫోన్ కొని మూడ్నెల్లు కూడా కాలేదు, అప్పుడే ముసిల్దయిపోయింది… దాని ఇష్టమోచినప్పుడు అలారం…

 3. Binary Opposite (in Telugu)

  Date 07 May 2018
  వ్యతిరేకం భాష నేర్చుకుంటున్నప్పుడు మనకు పదాలు, వాటి అర్థాలు, వ్యతిరేక పదాలు నేర్పుతారు. రేయ్! కొన్ని వ్యతిరేక పదాలు చెప్పండ్రా… అని మాష్టారు అడగ్గానే మనం ఠాక్కుమని ఆడ-మగ, పొట్టి-పొడుగు, దేవుడు-దయ్యం, మంచి-చెడు, న్యాయం-అన్యాయం, పుట్టుక-చావు అని తడుముకోకుండా చెప్పేస్తాం. బాగా బట్టీ కొట్టి నేర్చుకున్నవాయె, ఇవన్నీ మనం మామూలుగా మర్చిపోలేము. కానీ, కాలక్రమేణా మన జీవన ప్రయాణంలో మన ఆలోచనలలో మార్పు రావడం సహజం. మన అనుభవాలవల్ల నేర్చుకున్న…

 4. Who? (in Telugu)

  Date 01 May 2018
  ఎవరు? ఒక ఫొటో తీయడానికి వొక కెమెరా, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే చాలు అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ, ఒక ఫొటో తీయడం వెనక ఎంత శ్రమ ఉంటుందో, ఎంతమంది శ్రమజీవుల కష్టం ఉంటుందో మనం ఊహించడానికి అంత సులువు కాదు. ఒక కెమెరా తయారు చేయడంలో సుమారు పదహారు దేశాలలో వందలకొద్దీ శ్రామికులు తయారు చేసిన పార్ట్స్ వాడతారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రకరకాల యంత్రాలు ఖచ్చితమైన క్వాలిటీ…

 5. Black & White (In Telugu)

  Date 27 Apr 2018
  “నలుపూ తెలుపూ” “ఏంది పప్పా? నీకు కలర్స్ అస్సలు నచ్చయా? నువ్వెప్పుడూ ఈ బ్లాక్ & వైట్ పిక్చర్స్ తీస్తుంటవ్!” అని పరమ చికాకు మోకమేస్కోని అడిగిండు నా తొమ్మిదేళ్ళ కొడుకు. మావోనికి చెప్పుడు సంగతి పక్కకు పెడితే, అస్సలు నాకు తెల్సా ఈ బ్లాక్ & వైట్ పిక్చర్స్ అంటే నాకేందుకంత ఇష్టమని? అరె! చిన్నప్పటిసంది గిదే కథ. రంగులంటే పెద్దగ పట్టించుకోలే. చిన్నప్పుడు తెలుపంటే ఇష్టం, ఇప్పుడు…